fff

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - RPFలో 4600 ఎస్​ఐ & కానిస్టేబుల్ పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! -

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - RPFలో 4600 ఎస్​ఐ & కానిస్టేబుల్ పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - RPF SI And Constable Jobs 2024

RPF SI And Constable Jobs 2024 : రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్​బీ) రైల్వే ప్రొటక్షన్​ ఫోర్స్​ (ఆర్​పీఎఫ్​)లోని 4660 పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఆర్​పీఎఫ్ ఎస్​ఐ - 452 పోస్టులు
  • ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ - 4208 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 4660

విద్యార్హతలు
RPF SI And Constable Job Eligibility : సబ్​-ఇన్​స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం ఎస్​ఎస్​ఎల్​సీ (10వ తరగతి) చదివి ఉండాలి.

వయోపరిమితి
RPF SI And Constable Job Age Limit :

  • ఎస్ఐ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు - 25 ఏళ్ల మధ్య ఉండాలి.
  • కానిస్టేబుల్​ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు - 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు ఏజ్​ రిలాక్సేషన్​ ఇస్తారు.

సబ్​-ఇన్​స్పెక్టర్​ ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్​ (పీఈటీ)

  • ఎస్​ఐ పురుష అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్​లో 1600 మీటర్ల దూరాన్ని కేవలం 6 నిమిషాల 30 సెకెన్లలో పూర్తి చేయాలి.
  • ఎస్​ఐ స్త్రీ అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్​లో 800 మీటర్ల దూరాన్ని కేవలం 4 నిమిషాల్లో పూర్తి చేయాలి.
  • ఎస్​ఐ పురుష అభ్యర్థులు 12 అడుగల లాంగ్​ జెంప్​, 3 అడుగుల 9 ఇంచీలు హై జెంప్ చేయాలి.
  • ఎస్​ఐ స్త్రీ అభ్యర్థులు 9 అడుగల లాంగ్​ జెంప్​, 3 అడుగుల హై జెంప్ చేయాలి.

కానిస్టేబుల్​ ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్​ (పీఈటీ)

  • కానిస్టేబుల్ పురుష అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్​లో 1600 మీటర్ల దూరాన్ని కేవలం 5 నిమిషాల 45 సెకెన్లలో పూర్తి చేయాలి.
  • కానిస్టేబుల్ స్త్రీ అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్​లో 800 మీటర్ల దూరాన్ని కేవలం 3 నిమిషాల 40 సెకెన్లలో పూర్తి చేయాలి.
  • కానిస్టేబుల్ పురుష అభ్యర్థులు 14 అడుగల లాంగ్​ జెంప్​, 4 అడుగుల 9 ఇంచీలు హై జెంప్ చేయాలి.
  • కానిస్టేబుల్ స్త్రీ అభ్యర్థులు 9 అడుగల లాంగ్​ జెంప్​, 3 అడుగుల హై జెంప్ చేయాలి.

దరఖాస్తు రుసుము
RPF Application Fee :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి.
  • మహిళలు, ఎక్స్​-సర్వీస్​మెన్​, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
RPF Job Selection Process : అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్​ (పీఈటీ), ఫిజికల్ మెజర్​మెంట్​ టెస్ట్ (పీఎంటీ) చేస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి అర్హులైన అభ్యర్థులు ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
RPF SI And Constable Salary :

  • సబ్​-ఇన్​స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం ఇస్తారు.
  • కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 సాలరీ ఇస్తారు.

దరఖాస్తు విధానం
RPF Job Application Process :

  • అభ్యర్థులు ముందుగా https://rpf.indianrailways.gov.in/RPF/ ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ పేరు, ఫోన్​ నంబర్​, ఈ-మెయిల్​ వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • దీనితో మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్​వర్డ్ క్రియేట్ అవుతుంది.
  • ఈ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్​వర్డ్​లతో వెబ్​సైట్​లోకి లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఫొటో, సిగ్నేచర్​ సహా, అవసరమైన సర్టిఫికెట్స్​ అన్నీ అప్లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకుని, అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు
RPF Job Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఏప్రిల్ 15
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 మే 14

Comment As:

Comment (0)