రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), డైరెక్టర్ మారుతి(Maruthi) కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ది రాజాసాబ్(The RajaSaab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్(Malvika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్(Glimpse) మాత్రమే వదిలిన మేకర్స్ ఫ్యాన్స్‌ని ఇంకా వెయిటింగ్‌లో పెడుతున్నారు. అసలైతే రాజాసాబ్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ సినిమా ఆ టైంకు రావడం కష్టమని భావించి సైలెంట్‌గా ఉన్నారు. కనీసం దీనిపైనా ఎలాటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ చక్కర్లు కొడుతోంది.

దసరా బరిలో మరో బిగ్ సినిమా

కల్కి(Kalki)తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్.. చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. దీంతోనే రాజాసాబ్ చిత్రం లేటవుతోందని సినీ వర్గాల సమాచారం. అయితే ఏప్రిల్ మిస్సైన రాజా సాబ్ ఇప్పుడు కొత్తగా సెప్టెంబర్‌లో రిలీజ్‌ అవుతుందని అంటున్నారు. కొందరేమో సెప్టెంబర్ మొదటి వారం రిలీజ్ అని అంటుంటే మరికొందరు మాత్రం దసరాకి వస్తుందని చెబుతున్నారు. సెప్టెంబర్ చివర్లో అంటే విజయదశమి వారాల్లో రాజాసాబ్ వస్తుందని అంటున్నారు. ఐతే ఆల్రెడీ దసరాకి బాలకృష్ణ(Balakrishna) అఖండ-2(Akhanda2)ని దించుతున్నాడు. ఈ నేపథ్యంలో రెండు భారీ సినిమాలు బరిలో ఉంటే నేషనల్ లెవెల్ ఫైట్‌కి సిద్ధమవుతున్నట్టే లెక్క అని అభిమానులు అంటున్నారు.

ప్రభాస్, బాలయ్య మధ్య ఫైట్ ఉంటుందా..

అయితే రాజా సాబ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో రాకపోతే మాత్రం కచ్చితంగా దసరా(Dasara)కే రిలీజ్ ప్లాన్ చేస్తారని మరోవార్త చక్కర్లు కొడుతోంది. ఐతే అఖండ-2 ఒకవేళ రిలీజ్ వాయిదా పడితే చెప్పలేం కానీ ప్రభాస్, బాలయ్య మధ్య ఫైట్ రసవత్తరంగా ఉంటుందని చెప్పొచ్చు. రాజా సాబ్, అఖండ 2 రెండు సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సో సెప్టెంబర్, అక్టోబర్ సినిమాల రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమాల అఫీషియల్ రిలీజ్ డేట్లు(Official release dates) ఎప్పుడొస్తాయన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.