మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తల్లి అంజనాదేవి(Anjana Devi) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇవాళ (ఫిబ్రవరి 21) తెల్లవారుజామున ఆమె అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్‌(HYD)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఉదయం జరిగన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంజనాదేవి ఆరోగ్య ఈ విషయంపై మెగా ఫ్యామిలీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్న పవన్

ఇదిలా ఉండగా తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న AP డిప్యూటీ సీఎం, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) ఈరోజు కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హైదరాబాద్(HYD) వెళ్లారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా అంజనాదేవి అనారోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల అంజనా దేవి పుట్టిన రోజును మెగా ఫ్యామిలీ(Mega Family) ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే బాలకృష్ణ(NBK) నిర్వహించిన అన్‌స్టాపబుల్ సీజన్4లో రామ్ చరణ్‌ గెస్టుగా వచ్చినప్పుడు కూడా ఆమె వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు.