
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai pallavi) జోడీగా నటించిన లేటెస్ట్ సినిమా “తండేల్(Thandel)”. డైరెక్టర్ చందూ మొండేటి(Chandu Mondeti) రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం ఈనెల 7న థియేటర్లలోకి మంచి విజయం సాధించింది. బుజ్జితల్లి, హైలెసా ఇలా పలు పాటలతో పాటు ప్రమోషన్‌లు సైతం ఈ సినిమాపై తిరుగులేని బజ్‌ను క్రియేట్ చేశాయి. అయితే, తండేల్ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ..ఎబో యావరేజ్ హిట్టుగా మిగిలిపోయింది. టాక్ ఎలా ఉన్న.. కలెక్షన్లు(Collections) మాత్రం తొలిరోజే నుంచి ఊచకోత సృష్టించాయి. నాగ చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ డే1 కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. తండేల్ మొదటి రోజు అక్షరాల రూ.21 కోట్లు కొల్లగొట్టింది. దీంతో చైతూ కెరీర్లో కలెక్షన్స్ పరంగా బెగ్గెస్ట్ హిట్‌గానూ నిలిచింది.
థియేటర్లలో రన్ అవుతుండగానే..
తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ సినీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఓవైపు తండేల్ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా.. OTT రిలీజ్‌పై వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం దాదాపుగా రూ.30 కోట్లకుపైగా మేకర్స్‌కి చెల్లించినట్లు సమాచారం. అయితే ఇందులో సినిమా రిలీజ్ అయ్యిన సరిగ్గా నెలకే రానున్నట్టు తెలుస్తుంది. అంటే మార్చ్ 7 శుక్రవారం నుంచి తండేల్ పాన్ ఇండియా భాషల్లో రానున్నట్టుగా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
మత్స్యలేశం గ్రామంలో జరిగిన స్టోరీ ఆధారంగా..
ఇక తండేల్ మూవీ.. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం(D Matsyalesam) గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు గుజరాత్ పోర్ట్(Gujarat Port)కి వెళ్లిన సమయంలో అనుకోకుండా పాకిస్థాన్(Pakistan) సీ వాటర్స్ వెళ్లి అరెస్ట్ అవుతారు. అయితే వారు ఆ చెర నుంచి ఎలా బయటపడ్డారనేదే ఈ కథ. స్టోరీని మరింతగా కనెక్ట్ చేసేందుకు రాజు-సత్య అనే ఫిక్షనల్ లవ్ స్టోరీని జోడించారు మేకర్స్. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్(DSP) సంగీతం అందించగా బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు.