మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు చీపురుపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. గరివిడి మండల కేంద్రంలోని బొత్స క్యాంప్‌ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.ఈసందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించిందని ఆమె పేర్కొన్నారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, సేవా భావాన్ని చాటాయని తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు డాక్టర్‌ బొత్స అనూష కృతజ్ఞతలు తెలిపారు.