
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్లు, మనసు రెండూ కష్టపెట్టి మరీ అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) చేసిన సినిమా తండేల్(Thandel). చండూ మొండేటి(Director Chandu Mondeti) తెరకెక్కించిన ఈ మూవీ ఇవాళ (ఫిబ్రవరి 7)న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ మూవీలో చైతూకి జోడీగా సాయి పల్లవి(Sai Pallavi) నటించగా.. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు(Bunny Vasu) నిర్మించాడు. కాగా చైతూ ఇటీవల చేసిన మూవీలతో సరైన హిట్టు అందులేకపోవడంతో.. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో తండేల్‌లో నటించాడు. పాన్ ఇండియా(Pan India) రేంజ్‌లో ఇవాళ విడుదల తండేల్ కోరుకున్న తీరం చేరుకుందా? లేదా? తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే..
కథ ఏంటంటే?
శ్రీకాకుళం(Srikakulam) సముద్ర తీరంలో ఏడాదికి 8 నెలలు గుజరాత్ కంపెనీ కోసం పని చేస్తుంటాడు రాజు (నాగచైతన్య). చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన సత్య (సాయిపల్లవి) ని ప్రాణంగా ప్రేమిస్తాడు. కాబోయేవాడి ప్రాణభయంతో ఈ వృత్తి మానేయమని ఎంతగా వేడుకున్నా తండేల్ (Leader)గా ఎన్నుకోబడ్డ రాజు సత్య మాట వినడు. ఓ రాత్రి అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల అతనితో సహా మొత్తం ఇరవై రెండు మంది పాకిస్థాన్ ఆర్మీ(Pakistan Army)కి దొరికిపోతారు. వాళ్లని ఎలా విడిపించాలో అర్థం కాని పరిస్థితిలో సత్య పోరాటం మొదలు పెడుతుంది. తనవాళ్ల కోసం మొండిగా నిలబడ్డ రాజు పోరాటం ఏమైంది, చివరికి మన దేశానికి ఎలా చేరుకున్నారనే వివరాలు తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
ప్రేమ(Love)కు దానికి జనరేషన్‌తో సంబంధం లేదు. మారిన కొత్త ట్రెండ్‌కు తగ్గట్టు మార్పులు చేస్తూ.. కొత్త అంశాలు జోడిస్తే ఆకట్టుకునే కథలు రెడీ అవుతాయి. అలాంటి ప్రయత్నమే చేశాడు దర్శకుడు చందూ మొండేటి. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రచయిత కార్తీక్(Kartheek) ఇచ్చిన బ్యాక్ డ్రాప్‌కి తనదైన సినిమాటిక్ ట్రీట్ మెంట్‌తో తండేల్‌ని తెరకెక్కించాడు. కేవలం రాజు, సత్యల ప్రేమతోపాటు మత్య్సకారుల వెతలకు దేశభక్తిని జోడించి కాస్త కొత్తగా చెప్పాలని చూసిన ప్రయత్నం. అందుకే ఓపెనింగ్ సీన్ లోనే తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాడు డైరెక్టర్.
రాజుగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన చైతూ
ఫస్ట్ హాఫ్ మొత్తం రాజు, సత్యల ప్రేమకథతో వాళ్ల మధ్య బాండింగ్ ఎస్టాబ్లిష్ చేశాడు చందూ. దీనికి దేవిశ్రీ ప్రసాద్(DSP) ఆహ్లాదకరమైన సంగీతం, పాటలు, BGM మనల్ని ప్రశాంతంగా ప్రయాణం చేయిస్తాయి. కొన్ని మాములు సన్నివేశాల్లోనూ నాగచైతన్య, సాయిపల్లవిల నటన వాటిని నిలబెడుతూ వెళ్లిన వైనం ఎక్కడో మూల కొత్తగా ఏం లేదనే ఫీలింగ్ రాకుండా చేస్తాయి. రాజుని గూడెం జనాలు నాయకుడిగా ఎంపిక చేసుకోవడం అంతగా ఎలివేట్ కాకపోయినా ఫ్యాన్స్ వరకు మెప్పించేలానే సాగింది. చందూకి మాస్ పల్స్(Mass Pulse) మీద పట్టు లేకపోవడం వల్ల యాక్షన్ ఎపిసోడ్స్‌ని డిజైన్ చేసుకోవడంలో వంటివి మూవీ లయ తప్పేలా చేశాయి. నాగచైతన్య యాక్టింగ్, తండేల్ రాజుగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
అద్భుత నటనతో ఆకట్టుకున్న సాయిపల్లవి
సాయిపల్లవి నటన, డ్యాన్స్(Dance) సినిమాకి ప్లస్ పాయింట్లు.. కాగా భావోద్వేగాలు అనుకున్న మేర సాగకపోవడం, సాగదీత సీన్లు సినిమాకు మైనస్. క్లైమాక్స్(Climax)కు వెళ్లే క్రమంలో ఈ జంట ఎలా కలుసుకుంటుందనే ఉద్వేగం కలిగించడంలో చందూ మొండేటి అంతగా సక్సెస్ కాలేదు. తమిళం నుంచి తెచ్చిన కరుణాకరన్, పృథ్విరాజ్, ఆడుకాలం నరేష్ నటన పర్వాలేదు. పాకిస్థాన్ జైలర్ గా ప్రకాష్ బెలవాడి నప్పలేదు.
చివరగా.. నెమ్మదిగా భావోద్వేగాల బరువు తగ్గించే ప్రయత్నం చేసింది ‘తండేల్’
రేటింగ్ : 3.25/5