
హాస్య బ్రహ్మా.. కామెడీ కింగ్ బ్రహ్మానందం(Brahmanandam), ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Goutham), వెన్నెల కిశోర్(Vennela Kishore) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం(Brahma Aandam)’. డైరెక్టర్ RVS నిఖిల్ తెరకెక్కించగా.. రాహుల్ యాదవ్ నక్కా(Rahul Yadav Nakka) నిర్మించాడు. వాలంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా ఇవాళ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ చిత్రంలో బ్రహ్మీ తాతగా నటించగా.. ఆయన తనయుడు రాజా గౌతమ్ మనువడి పాత్ర పోషించారు. మరీ తాత-మనవళ్ల మధ్య ఉండే ప్రేమను డైరెక్టర్ ఎలా చూపించారు? చాలా రోజుల తర్వాత సీనియర్ కామెడియన్ బ్రహ్మానందం నటనతో ఎలా ఆకట్టుకున్నారు? అసలు మూవీ స్టోరీ ఏంటి? ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటనే విషయాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం..
కథ ఏంటంటే?
పేరెంట్స్‌ను బ్రహ్మానందం(రాజా గౌతమ్) చిన్నతనంలోనే కోల్పోతాడు. ఇతడికి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉంటుంది. తన స్నేహితుడు గిరి (వెన్నెల కిషోర్)తో కలిసి జీవితాన్ని గడుపుతూ, నటుడిగా స్థిరపడాలనే కల కలగంటూనే ఉంటాడు. అయితే తొమ్మిదేళ్లుగా ఉద్యోగం లేకుండా, అప్పుల కష్టాల్లో ఉన్న బ్రహ్మానందానికి స్టేజ్ ఆర్టిస్ట్(Stage artist)గా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది. కానీ, ఇందుకోసం ఆరు లక్షల రూపాయలు అవసరం అవుతుంది. ఈ క్రమంలో అతని ప్రేయసి తార (Priya Vadlamani) సాయం చేయాలనుకుంటుంది.
బ్రహ్మానందం ఆ కండిషన్లు పాటించాడా?
కానీ అతను తనను నిజంగా ప్రేమించడం లేదని గ్రహించి వెనక్కి తగ్గుతుంది. అప్పుడే ఓల్డ్ ఏజ్ హోంలో ఉంటున్న తన తాత బ్రహ్మానందమూర్తిని (బ్రహ్మానందం) కలుసుకుంటాడు. తాత కొన్ని కండిషన్లు పాటిస్తే, తన ఆరు ఏకరాల భూమిని అమ్మి డబ్బులు ఇస్తానని మాటిస్తాడు. బ్రహ్మానందం ఆ కండిషన్లు పాటించాడా? తన ఊరును వదిలి ఇంకో ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మూర్తి జ్యోతి (రామేశ్వరి)కి ఈ కథలో ఉన్న సంబంధం ఏమిటి? ఈ ట్విస్టులన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కాన్సెప్ట్ ఏంటి?
ఈ కథలో.. జీవితం చరమాంకంలో ఒక్క తోడు ఎంతో ముఖ్యం, ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు దర్శకుడు. అయితే, కథనాన్ని అంత స్పష్టంగా నడిపించలేకపోవడం కొంత మైనస్. ఫస్టాఫ్ ఓకే. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కాస్త లాగ్ అనిపిస్తాయి. కామెడీ చేస్తూనే ఎమోషన్స్ పండించాలని దర్శకుడు చేసిన ప్రయత్నం భేష్ అని చెప్పుకోవచ్చు. భారీ ఎలివేషన్స్.. అనవసరమైన హంగామా లేకుండా క్లీన్ గా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. మొత్తంగా చెప్పాలంటే టాలీవుడ్లో బ్రహ్మా ఆనందం ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనొచ్చు.
ఎవరెలా నటించారంటే..
బ్రహ్మానంద మూర్తి పాత్రలో బ్రహ్మానందం ఎప్పటిలాగే సహజంగా నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. గిరి పాత్రలో అదరగొట్టాడు. రాజా గౌతమ్ తన పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ, సంగీతం సరాసరి స్థాయిలో ఉన్నాయి. సినిమాకు మెరుగైన స్క్రీన్‌ప్లే, బలమైన ఎమోషనల్ కంటెంట్ ఉంటే వేరేలా ఉండేది. డైరెక్టర్ కథని నడిపించిన విధానం, స్క్రీన్ ప్లే రొటీన్‌కి భిన్నంగా ఉండి ప్రేక్షకులను సినిమాకు కనెక్ట్ చేసేలా ఉన్నాయి.
చివరగా.. ఈ సినిమా చూసిన వారికి బ్రహ్మా‘‘ఆనంద’’మే
రేటింగ్.. 2.50/5