కాప్రా స‌ర్కిల్ ప‌రిధిలో మల్లాపూర్ డివిజ‌న్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో సెంట్ర‌ల్ సీటీగా అభివృద్ధి చేస్తాన‌ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.మంగళవారం ఓల్డ్ మల్లాపూర్ ఇదమ్మ టెంపుల్ వద్ద రూ.60 లక్ష ల రూపాయలతో సీ సీ రోడ్ నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.