
బస్సు ప్రయాణికులకు టీజీఆర్టీసీ(TGRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి అదిరిపోయే ఫెసిలిటీ తీసుకొచ్చింది. కేవలం రూ. 99 రూపాయలతో సౌకర్యవంతంగా HYD-Viyawada చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (Electric vehicles) బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ETO మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను నిన్న బేగంపేటలోని ITC కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రారంభించారు.
5 గంటల్లోనే గమ్యస్థానం చేరొచ్చు
ఈ సందర్భంగా ETO మోటార్స్ CMO వైఎస్ రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా MD సూర్య ఖురానా మాట్లాడుతూ.. మూడు నాలుగు వారాల తర్వాత హైదరాబాద్-విజయవాడ మధ్య EV బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం విజయవాడ-విశాఖపట్నం మధ్య ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సేవలు ప్రారంభమైన తర్వాత 4 వారాల పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ. 99తో ప్రయాణించవచ్చని వివరించారు. అన్ని ప్రభుత్వ పథకాలు(All Govt Schemes) ఈ బస్సుల్లో వర్తిస్తాయని, 5 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చన్నవారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించవచ్చని, రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్ బస్సుల(Sleeper coach buses)ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.