
గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల(Padma Awards)ను ప్రకటించింది. వివిధ రంగాలలో విశేష సేవలు, ప్రతిభ కనబర్చిన 139 మందికి కేంద్రం పద్మ అవార్డులను అందజేయనుంది. ఈ సందర్భంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు కళల విభాగంలో పద్మ భూషణ్(Padma Bhushan) అవార్డు దక్కింది. అలాగే దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. కాగా బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంతో తెలుగు ప్రజలు, నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.