
అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప-2(Pushpa2). ప్రపంచవ్యాప్తంగా గత డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమా థియేటర్‌లలో రికార్డులు సృష్టించింది. భారీ విజయాన్ని అందుకున్న పుష్పరాజ్ జనవరి 30న నెట్ ఫ్లిక్స్(Netflix)లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లోనూ రికార్డు సృష్టించింది. పుష్ప2 OTTలోకి వచ్చినప్పటి నుంచి వ్యూస్(Views) పరంగా టాప్‌లో ఉంది. తాజాగా 7 దేశాల్లో నంబర్ వన్ ప్లేస్ కైవసం చేసుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషేతర సినిమా విభాగంలో 5.8M వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. వీక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఫిదా
గత నెల 17న రీలోడెడ్ వర్షన్(Reloaded Version)ను విడుదల చేశారు. కొన్ని సీన్స్ యాడ్ చేసి రిలీజ్ చేశారు. మొదట 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన పుష్ప2కు అదనంగా ఇటీవల మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది. ఇక OTT వెర్షన్ కూడా ఇదే నిడివితో అందుబాటులో ఉంది. ఇది ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఆడియన్స్(International audience) ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా జాతర సీన్స్‌కు వారంతా ఫిదా అవుతున్నారు.
రికార్డు స్థాయిలో కలెక్షన్స్
కాగా ఈ మూవీ రూ.1850 కోట్లకు పైగా వసూలు(Collections) చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించారు. సునీల్, జగపతిబాబు, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.