సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు SS రాజమౌళి (Rajamouli) కాంబోలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఇటీవల ప్రారభమైంది. ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఓ కీలకపాత్ర పోషిస్తోన్న ఈ మూవీలో ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే రాజమౌళి మహేశ్ బాబు పాస్ట్ పోర్ట్‌(Mahesh Passport)ను స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చే ఓ వీడియో(Video)ను సైతం రిలీజ్ చేయడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. అయితే భారీ బడ్జెస్ మూవీ కావడంతో రాజమౌళి ఎక్కడా ఎలాంటి లీక్‌లు(Leaks) లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

అదే జరిగితే భారీ మూల్యం చెల్లించాల్సిందే..

మహేశ్‌తో కొత్త చిత్రం నేపథ్యంలో మూవీ యూనిట్‌కు రాజమౌళి స్ట్రాగ్ వార్నింగ్ జారీ చేసినట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందులో నటించే నటీనటులు, టెక్నికల్ సిబ్బంది, ఇతర సిబ్బందితో నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్(Non-Disclosure Agreement) చేయించినట్లు ఓ ఇంగ్లిష్ పత్రిక కథనాలు పేర్కొన్నాయి. దీని ప్రకారం ప్రాజెక్టుకు సంబంధఇంచి ఎలాంటి విషయాన్ని బయటకు చెప్పడానికి వీల్లేదు. డైరెక్టర్-ప్రొడ్యూసర్స్ అనుమతి లేకుండా ఎవరైనా మూవీ సమాచారాన్ని బయట డిస్కస్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటిది జరిగితే భారీ మూల్యం చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశాడు జక్కన్న.

ఎవరికీ ఫోన్ అనుమతి లేదు

ఇదిలా ఉండగా మూవీ అల్యూమినియం ఫ్యాక్టరీ(Aluminum Factory)లో తీర్చిదిద్దన సెట్‌లోకి ప్రస్తుతం హీరోతో సహా సెట్‌లో ఉన్న వారెవరూ తమ సెల్ ఫోన్ల(Mobile Phones)ను తీసుకురావడానికి పర్మిషన్ లేదని టాక్. పాన్ ఇండియా రేంజ్ మూవీ కాబట్టి రాజమౌళి అన్ని జాగ్రత్తలు పక్కాగా తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) నటించబోతున్నారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం జాన్ అబ్రహాం(John Abraham) పేరు కూడా వినిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీలో నటించే నటీనటులపై మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.