
దేశంలోని పలువురు కీలక నేతల ఆస్తులకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (Association for Democratic Reforms), నేషనల్ ఎలక్షన్ వాచ్ (National Election Watch) సంస్థలు తాజాగా కీలక నివేదిక విడుదల చేశాయి. దీంట్లో ముఖ్యమంత్రుల ఆస్తుల(Assets of Chief Ministers) వివరాలను వెల్లడించాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల CMలు.. ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక(Report) రూపొందించినట్లు ఆ సంస్థలు పేర్కొన్నాయి.
దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో AP సీఎం చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనకు కుటుంబ ఆస్తితో కలిపి రూ.931 కోట్ల ఆస్తులున్నట్లు నివేదిక పేర్కొంది. ఇక ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండు రూ.332 కోట్ల సంపదతో ధనిక ముఖ్యమంత్రిగా రెండోస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కర్ణాటక CM సిద్దరామయ్య రూ.51కోట్ల అసెట్స్‌తో థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) 7వ స్థానంలో నిలిచారు. ఆయనకు రూ.30.4కోట్ల ఆస్తులున్నట్లు నివేదిక తెలిపింది. దేశంలోనే అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఆమెకు కేవలం రూ.15 లక్షల ఆస్తే ఉందని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది.
ఇక అప్పుల విషయానికొస్తే.. AP CM చంద్రబాబుకు రూ.10 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక అరుణాచల్ సీఎం పెమాఖండు రూ.180కోట్ల అప్పులతో టాప్‌లో ఉన్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రూ.23 కోట్ల అప్పులున్నట్లు తేలింది. ఇక కేసుల విషయంలో తెలంగాణ సీఎం ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. రేవంత్‌పై 72 ఐపీసీ, 89 సాధారణ కేసులున్నాయని నివేదిక తెలిపింది. ఆ తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబుపై అధిక కేసులున్నటున్నట్లు వెల్లడించింది.