
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్(Unstoppable with NBK Season 4). ఈ టాక్ షో ఇప్పటికే అభిమానుల్లో చాలా క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రముఖ OTT ప్లాట్ ఫాం ‘ఆహా(Aha)’ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను రన్ చేస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లనుంచి ఫ్యాన్స్‌కు బాలయ్య ఓ రేంజ్‌లో అలరిస్తున్నారు. తాజా 4వ సీజన్లలోనూ సినీ, రాజకీయ ప్రముఖములను షోకు పిలిచి గేమ్స్ ఆడించడం, వారి సీక్రెట్స్‌ను బయటపెట్టించడం బాగా వర్కౌట్ అవుతోంది. తాజా ఎపిసోడ్‌లో వెంకీమామ(Victory Venkatesh)తో బాలయ్య తన తికమక ప్రశ్నలతో అభిమానులను అలరించారు.
జనవరి 10న వచ్చేస్తోంది..
ఈషోకు వచ్చే నెక్ట్స్ గెస్ట్ ఎవరనేదానిపై తాజాగా మరో క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. ఈ షోలో ‘గేమ్ ఛేంజర్ టీమ్(Game Changer Team)’ బాలయ్య బాబుతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ రేపు జరగునున్నట్లు టాలీవుడ్(Tollywood) వర్గాలు తెలిపాయి. మరి ఈ ఎపిసోడ్‌లో చెర్రీ(Ram Charan)తో పాటు ఎవరు జాయిన్ అవుతారో చూడాలి. కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ మూవీలో అంజలి కీలకపాత్రలో కనిపించనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదల కానుంది.
అభిమానులకు జోష్ ఇచ్చే స్పీచ్
శంకర్(Director Shankar) తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ అవైటెడ్ చిత్రం ఎన్నో అంచనాలు సెట్ చేసుకుంది. సాలిడ్ కమర్షియల్ డ్రామాగా ప్లాన్ చేయగా ఇపుడు ఆఫ్ లైన్‌లో మేకర్స్ ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో కొనసాగిస్తున్నారు. లేటెస్ట్‌గా రామ్ చరణ్ భారీ కటౌట్(Rerry Huge Cutout) లాంచ్ చేయగా.. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు(Dil Raju) మెగా అభిమానులకి ఫుల్ జోష్ ఇచ్చే స్పీచ్‌ని అందించాడు. ఈ మూవీలో చెర్రీ మూడు పాత్రల్లో సందడి చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో గేమ్ ఛేంజర్‌పై అంచనాలు మరింత పెరిగాయి.